• Neti Charithra

Breaking.. విద్యుత్ సిబ్బంది నిర్లక్ష్యం.. తాత్కాలిక ఉద్యోగి మృతి..తో విషాదం..!


Breaking.. విద్యుత్ సిబ్బంది నిర్లక్ష్యం.. తాత్కాలిక ఉద్యోగి మృతి..తో విషాదం..!



గుంటూరు: నేటి చరిత్ర


గుంటూరు జిల్లా లో విద్యుత్ సిబ్బంది నిర్లక్ష్యం తో ఓ యువకుడు మృతి చెందిన ఘటన జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి.

చిలకలూరిపేట పట్టణ మంచినీటి చెరువుకు సమీపంలో మంగళవారం విద్యుత్తు లైన్లు కలిపే క్రమంలో ఎల్‌సీ (విద్యుత్తు లైన్‌ క్లియర్‌) అవగాన లోపం, నిర్లక్ష్యం తోడు కావడంతో మృత్యువు కరెంటు తీగల రూపంలో ఓ యువకున్ని కాటేసింది. పట్టణ పరిధిలో టిడ్కో గృహాలకు సంబంధించి విద్యుత్తు ఇండోర్‌ ఉప కేంద్రం నిర్మాణం చేస్తున్నారు. పనులను జీవీఎస్‌ సంస్థ

చేపట్టింది. ఇందులో కొన్ని పనులను మరో సబ్‌ కాంట్రాక్టర్‌కు అప్పగించారు. అతను కొంతమంది యువకులను తీసుకుని పనులు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే చెరువు సమీపంలో పోతవరం 132 కె.వి. విద్యుత్తు ఉప కేంద్రం వద్ద నుంచి వచ్చే తీగలకు టిడ్కో ఉప కేంద్రానికి ఏర్పాటు చేసిన లైనును కలిపే పనులు నాదెండ్లకు చెందిన సాగర్‌ అనే యువకుడు చేస్తున్నాడు. ఈ క్రమంలో హఠాత్తుగా ఒక లైనుకు విద్యుత్తు సరఫరా రావడంతో అతను విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు.