- Neti Charithra
Breaking.. విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న కారు.. మంటల ధాటికి ఇద్దరు సజీవ దహనం..!
Breaking.. విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న కారు..
మంటల ధాటికి ఇద్దరు సజీవ దహనం..!
నేటి చరిత్ర:(ప్రత్యేక ప్రతిని థి)
కారు అదుపు తప్పి విద్యుత్ స్టభాన్ని ఢీ కొనడం తో మామ అల్లుళ్లు సజీవ దహనం అయిన ఘటన తూర్పుగోదావరి జిల్లా లో విషాదాన్ని నింపింది. పోలీసుల కథనం మేరకు..దేవీపట్నం మండలం ఫజిల్లాబాదు నుంచి ఒకే కుటుంబానికి చెందిన అయిదుగురు వ్యక్తులు కారులో విశాఖపట్నం బయలుదేరారు. జగ్గంపేట మండలం మల్లిసాల గ్రామ సమీపంలో వాహనం అదుపుతప్పి విద్యుత్తు స్తంభాన్ని ఢీకొంది. స్తంభం విరిగి కారుపై పడింది. కారు నడుపుతున్న మట్టు సతీష్(41) పక్కన కూర్చున్న వీర్ని హనుమంతరావు(56) ఎడమవైపు నుంచి కారు దిగుతుండగా డోరు పక్కనున్న విద్యుత్తు తీగలు తగిలి మంటలు వ్యాపించాయి. ఆయనను రక్షించే క్రమంలో సతీష్ సైతం విద్యుదాఘాతానికి గురయ్యాడు. ఇద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు.
434 views0 comments