• Neti Charithra

Breaking.. విద్యుత్ సబ్ స్టేషన్ లో ఉరి వేసుకొని ఉద్యోగి ఆత్మహత్య.. చిత్తూరు జిల్లా లో ఘోరం..!


Breaking.. విద్యుత్ సబ్ స్టేషన్ లో ఉరి వేసుకొని ఉద్యోగి ఆత్మహత్య.. చిత్తూరు జిల్లా లో ఘోరం..!



శ్రీకాళహస్తి: నేటి చరిత్ర


చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి లో విద్యుత్ సబ్ స్టేషన్ లో పనిచేసే షిప్ట్ ఆపరేటర్ ఆత్మహత్యకు పాల్పడటం కల కలం రేపింది. శ్రీకాళహస్తి వామపల్లె సబ్ స్టేషన్ లో షిఫ్ట్ ఆపరేటర్ సుబ్బయ్య కొంత కాలం విధులకు


హాజరు కాలేదు. కొద్ది రోజులుగా విధులకు హాజరు అవుతుండగా మంగళవారం రాత్రి డ్యూటికి వచ్చిన అతను రాత్రి రెండు గంటల సమయంలో సబ్ స్టేషన్ లోనే ఆత్మహత్య చేసుకోవడం గమనార్హం. ఇతన్ని ఎవరైనా హత్య చేశారా.. లేక ఆత్మహత్యకు పాల్పడ్డాడా.. అన్న విషయం విచారణలో తేలాల్సి ఉంది. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు