• Neti Charithra

Breaking.. విద్యుతా ఘాతం తో షిఫ్ట్ ఆపరేటర్ మృతి.. మదనపల్లె లో ఉద్రిక్తత..!


Breaking.. విద్యుతా ఘాతం తో షిఫ్ట్ ఆపరేటర్ మృతి.. మదనపల్లె లో ఉద్రిక్తత..!


మదనపల్లె: నేటి చరిత్ర


చిత్తూరు జిల్లా మదనపల్లి రూరల్ మండలం

కోళ్ళబైలు విద్యుత్ సబ్ స్టేషన్ షిప్టు డ్యూటీ ఆపరేటర్ సుధాకర్ విద్యుత్ షాక్ తో మృతి చెందిన సంఘటన ఆదివారం మదనపల్లి లో చోటు చేసుకొంది. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట ధర్నా చేశారు.వివరాలు ఇలా ఉన్నాయి.





కోళ్ల బైలు పంచాయతీ సమీపం లో

వ్యవసాయ పొలంలో విద్యుత్ లైన్ పనులు చేస్తుండగా ఈ సంఘటన చోటు చేసుకుందని విద్యుత్ శాఖ ఏఈ డేవిడ్ మృతుని సమీప బందువులకు వివరించారు. ఈ మృతుని‌ సమీప బందువులు లైన్ మ్యాన్ బానుప్రకాష్ తప్పిదం వుందని దీనిపై సమగ్ర దర్యాప్తు చేయించాలని‌, లైన్ మ్యాన్ తోపాటు బాధ్యులు ఆయిన్ వారిని

సస్పెండ్ చేయాలని, మృతుని కుటుంబానికి న్యాయం చేయాలని వారు

డిమాండ్ చేశారు. లైన్ మ్యాన్ తిట్టడంతో రెండు రోజులుగా సుధాకర్ మధన పడుతున్నాడని బందువులు ఏఈ డేవిడ్ ను నిలదీశారు. లైన్ మ్యాన్ కారణంగానే సుధాకర్ మృతి చెందడని వారు తీవ్ర వాగ్వివాదం చేశారు. ‌ న్యాయం జరుగే వరకు రాస్తారోకో విరమించేది లేదని నిరసనకు దిగటం తో ఉద్రిక్తత నెలకొంది. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.


748 views0 comments
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon