• Neti Charithra

Breaking.. విద్యుతా ఘాతం తో ఆర్టీసీ మెకానిక్ మృతి..!


Breaking.. విద్యుతా ఘాతం తో ఆర్టీసీ మెకానిక్ మృతి..!



నేటి చరిత్ర: (ప్రత్యేక ప్రతిని థి)


ఖమ్మం ఆర్టీసీ డిపో మెకానిక్‌ సూత్రాయ శ్రీనివాసరావు (56) విద్యుతా ఘాతంతో

మృతి చెందిన ఘటన మహబూబాబాద్‌ జిల్లా నర్సింహులపేట మండలంలో చోటుచేసుకుంది. ఎస్సై నరేశ్‌ తెలిపిన

వివరాల ప్రకారం.. ఖమ్మం డిపోకు చెందిన ఎక్స్‌ప్రెస్‌ బస్సు ఉదయం ఖమ్మం బస్టాండ్‌ నుంచి హన్మకొండకు ప్రయాణికులతో బయలుదేరింది. నర్సింహులపేట మండలం గోపాతండా సమీపంలోకి రాగానే మరమ్మతులకు గురైంది. మరో బస్సులో డ్రైవర్‌ రమేశ్‌, మెకానిక్‌ శ్రీనివాసరావును పంపించగా వచ్చి సిద్ధం చేశారు. ఇంతలో డ్రైవర్‌ బస్సును వెనక్కి తిప్పుతుండగా సమీపంలోని 11-కేవీ విద్యుత్తు వైర్లు బస్సు వెనుక భాగంలోని గూడ్స్‌ ల్యాడర్‌కు తాకడంతో కుడి వైపు ముందు టైరు కాలిపోయింది. గమనించిన శ్రీనివాసరావు టైరును పరిశీలించేందుకు వచ్చి విద్యుత్తు

తీగలను పట్టుకోవడంతో స్పృహ కోల్పోయాడు. డ్రైవర్‌ చాకచాక్యంగా కిందకు దూకి ప్రాణాలు రక్షించుకున్నారు. 108 వచ్చే లోపే శ్రీనివాసరావు మృతి చెందారు. తీగలను గమనించకుండా వెనక్కి తీసి మెకానిక్‌ మృతికి కారణమైన డ్రైవర్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు