• Neti Charithra

Breaking.. విద్యుతా ఘాతం.. ఇద్దరు మృతి తో గ్రామం లో విషాదం..!


Breaking.. విద్యుతా ఘాతం.. ఇద్దరు మృతి తో గ్రామం లో విషాదం..!
అనంతపురం: నేటి చరిత్ర

(విద్యుతా ఘాతం తో మృతి చెందిన ఇద్దరు)


విద్యుతా ఘాతం తో ఇద్దరు మృతి చెందిన ఘటనఅనంతపురం జిల్లా బొమ్మనహల్‌ మండలం లాల్‌బహదూర్‌ నగర్‌ (ఎల్బీ నగర్‌) గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. మంగళవారం గ్రామానికి చెందిన రైతు ప్రసాద్‌ (52), ఉద్దేహళ్‌ గ్రామానికి చెందిన ట్రాక్టర్‌ డ్రైవర్‌ వలీ భాష (40) విద్యుదాఘాతానికి గురై మరణించారు. బొమ్మనహల్‌ పోలీసుల కథనం మేరకు.

రైతు ప్రసాద్‌ పొలంలో వ్యవసాయ పనులు చేస్తుండగా విద్యుదాఘాతానికి గురయ్యాడు. అతన్ని కాపాడేందుకు వెళ్లిన డ్రైవర్‌ వలీ భాష కూడా విద్యుదాఘాతానికి గురై మరణించాడు. దీంతో గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. బొమ్మనహల్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.