• Neti Charithra

Breaking.. విద్యుత్ ఉత్పత్తి కేంద్రం లో భారీ అగ్నిప్రమాదం.. లక్షల్లో ఆస్తి నష్టం..!


Breaking.. విద్యుత్ ఉత్పత్తి కేంద్రం లో భారీ అగ్నిప్రమాదం.. లక్షల్లో ఆస్తి నష్టం..!


అనంతపురం: నేటి చరిత్ర


విద్యుత్ ఉత్పత్తి కేంద్రం లో జరిగిన అగ్ని ప్రమాదం అనంతపురం జిల్లాలో చోటు చేసుకోగా లక్షల్లో ఆస్తి నష్టం జరిగింది.

వివరాలు ఇలా ఉన్నాయి. కూడేరులోని పవన విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రం సమీపంలో అగ్ని ప్రమాదం సంభవించింది. కూడేరు మండలం ముద్దలాపురం సమీపంలో ఉన్న సుజ్లాన్‌ పవన విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రానికి చెందిన వ్యర్థాలకు ఆదివారం మధ్యాహ్నం గుర్తుతెలియని వ్యక్తులు నిప్పుపెట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. నిప్పు పెట్టిన కాసేపటికే పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో దట్టంగా పొగలు వ్యాపించాయి. ఇది గమనించిన చుట్టు పక్కల గ్రామాల్లోని ప్రజలు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని నాలుగు యంత్రాల ద్వారా మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఉత్పత్తి కేంద్రానికి కొద్ది దూరంలో మంటలు చెలరేగినప్పటికీ విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రం వరకు వ్యాపించకపోవడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.


Recent Posts

See All

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

ఈ నెల 29వ తేదీన జగనన్న విద్యా దీవెన కార్యక్రమం అమలుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం జగన్‌ అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. వివిధ పోస్టుల భర్తీతో సహా పలు అంశాలపై కేబినెట్