• Neti Charithra

Breaking.. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం.. ఒకరు మృతి.. చిత్తూరు జిల్లాలో జాతీయ రహదారి దిగ్బంధం..!


Breaking.. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం.. ఒకరు మృతి.. చిత్తూరు జిల్లాలో జాతీయ రహదారి దిగ్బంధం..!



నారాయణ వనం: నేటి చరిత్ర


(మృతి చెందిన బాలాజీ)


విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యంతో ఓ వ్యక్తి విద్యుతా ఘాతంతో మృతి చెందిన ఘటన చిత్తూరు జిల్లా నారాయణ వనం లో ఉద్రిక్తతకు దారి తీసిన ఘటన ఆదివారం చోటు చేసుకొంది.


(జాతీయ రహదారి పై నిరసనకు దిగిన బాధితులు)


నారాయణ వనం మండలం గోవిందప్ప నాయుడు కండ్రిగ కు చెందిన బాలాజీ సొంతపనుల కోసం విద్యుత్ సబ్ స్టేషన్ కు ఫోన్ చేసి ఎల్సీ అడిగాడు. ఎల్సీ లోనే విద్యుత్ లైన్ ఉందని చెప్పడంతో బాలాజీ విద్యుత్ స్తంభం ఎక్క బోతుండగా విద్యుత్ సరఫరా ఉండటంతో విద్యుతా ఘాతం జరిగింది. అతన్ని ఆసుపత్రి కి తరలించగా చికిత్స పొందుతూ అతను మృతి

చెందాడు. సమాచారం తెలుసుకున్న బాధిత కుటుంబ సభ్యులు జాతీయ రహదారి. పై బైఠాయించి నిరసనకు దిగడం తో ఉద్రిక్తత నెలకొంది. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగ బాధ్యులు ఆయిన్ విద్యుత్ సిబ్బంది పై చర్యలు తీసుకోవాలని వారు నిరసనలు చేపట్టారు.


222 views0 comments
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon