- Neti Charithra
Breaking.. వైజాగ్ బీచ్ లో తేలిన... చిత్తూరుజిల్లా యువకుని మృత దేహం..!
Breaking.. వైజాగ్ బీచ్ లో తేలిన... చిత్తూరుజిల్లా యువకుని మృత దేహం..!
కురబలకోట: నేటి చరిత్ర
(రామాంజినేయులు)
చిత్తూరు జిల్లా కురబలకోట మండలానికి చెందిన ఓ యువకుడు మృత
దేహం విశాఖ బీచ్ లో బయట పడిన ఘటన చోటు చేసుకుంది. ఇందుకు
(వైజాక్ బీచ్ లో తేలిన యువకుడి మృత దేహం)
సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
కురబలకోటమండలానికి చెందిన ఐదుగురు యువకులు వైజాగ్, అన్నవరం
తదితర ప్రాంతాలకు ఐదు రోజుల క్రితం విహార యాత్రకు వెళ్లారు. ఈ సందర్భంగా
వీరి లో నలుగురు మాత్రం రెండు రోజుల క్రితం స్వగ్రామలకు చేరుకున్నారు. అయితే
పూజారివారిపల్లి నుంచి జగన్నాథ్
(విహార యాత్రకు వెళ్లిన యువకులు)
మాత్రం ఇంటికి చేరుకోలేదు. అతని పర్సు.. ,మొబైల్ ఫోన్ లు మాత్రం తమవద్ద ఉన్నాయని తిరిగి వచ్జిన నలుగురు యువకులు జగన్నాదం కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.
తాజాగా ఆదివారం వైజాక్ బీచ్ లో
అప్పఘర్ తీరం లో గుర్తు తెలియని శవం తేలాడు తున్న సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ఈ సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు వైజాక్ కు వెళ్లారు. ఈ ఘటన పై విహార యాత్ర కు వెళ్లిన వారిని ముదివేడు పోలీసులు విచారిస్తున్నట్లు సమాచారం.