- Neti Charithra
Breaking.. విజయవాడ లో కాల్పులు.. పోలీస్ కమిషనర్ కార్యాలయ ఉద్యోగి మృతి!
Breaking.. విజయవాడ లో కాల్పులు..
పోలీస్ కమిషనర్ కార్యాలయ ఉద్యోగి మృతి!
నేటి చరిత్ర: (ప్రత్యేక ప్రతిని థి)
(కాల్పుల్లో మృతి చెందిన మహేష్)
విజయవాడ నగర శివారులో తుపాకీ కాల్పులు హడల్ ఎత్తించాయి.
అర్ధరాత్రి యువకుడిని దుండగులు తుపాకీతో కాల్చి చంపిన ఘటన శనివారం
అర్ధరాత్రి చోటుచేసుకుంది.మృతుడిని విజయవాడ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో పనిచేసే మహేష్‌గా గుర్తించారు. కాల్పుల ఘటన విజయవాడ శివారు బైపాస్‌రోడ్డులోని బార్ సమీపంలో చోటుచేసుకుంది. పథకం ప్రకారమే
మహేష్‌ను హతమార్చినట్లు పోలీసులు
భావిస్తున్నారు. సీపీ బత్తిన శ్రీనివాసులు ఘటనా స్థలాన్ని అర్ధరాత్రి పరిశీలించారు. నిందితుల ఆచూకీ కోసం పోలీసు ప్రత్యేక బృందాలు గాలింపు చేపట్టాయి.
251 views0 comments