• Neti Charithra

Breaking.. విజయవాడ దుర్గమ్మ ఆలయం వద్ద అపశృతి..విరిగిపడ్డ కొండచరియలు..పలువురికి గాయాలు!


Breaking.. విజయవాడ దుర్గమ్మ ఆలయం వద్ద అపశృతి..విరిగిపడ్డ కొండచరియలు..పలువురికి గాయాలు!


విజయవాడ: నేటి చరిత్ర



ప్రముఖ పుణ్యక్షేత్రం బెజవాడ ఇంద్రకీలాద్రి కొండపైన మౌన స్వామి ఆలయం వద్ద పెద్ద రాళ్లు పైన పడ్డంతో భక్తులు ఉలిక్కి పడ్డారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి మరి కొద్ది గంటల్లో అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించే ముందు అపశృతి చోటు చేసుకోవడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. ఈ సందర్భంగా పలువురికి గాయాలు


అయ్యాయి. ప్రమాద స్థలాన్ని మంత్రి నాని, ఎమ్మెల్యే విష్ణు తదితరులు సందర్శించారు.

గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా నాలుగు అంగులాల మేర కొండ బీటలు వారిందని ఇంజనీర్

భాస్కర్ తెలిపారు. అయితే, మౌన స్వామి కొండ ప్రాంతం ప్రమాదకరం కాదరి ఆయన చెప్పారు. గత కొన్ని ఏళ్లుగా కొండ బీటలు

వారుతూనే ఉందని ఆయన చెప్పారు.

ఈ ప్రాంతాన్ని పరిశీలించిన నిపుణుల కమిటీ ప్రమాదకరం కాదని గుర్తించిందని తెలిపారు. చిన్న చిన్న రాళ్లు పడుతున్న దృష్ట్యా బ్యారికేట్లు పెట్టి అటుగా భక్తులు రాకుండా చూస్తున్నామన్నారు. అయితే, ప్రకృతి రిత్య పడితే మాత్రం జాగ్రత్త అవసరమన్నారు.


127 views0 comments
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon