• Neti Charithra

Breaking.. వరదయ్య పాలెం లో పోలీసుల దాడులు.. భారీగా పట్టుపడ్డ గంజాయి..!


Breaking.. వరదయ్య పాలెం లో పోలీసుల దాడులు.. భారీగా పట్టుపడ్డ గంజాయి..!



వరదయ్యపాలెం: నేటి చరిత్ర


(వరదయ్యపాలెం లో పోలీసుల కు పట్టుపడ్డ గంజాయి)


చిత్తూరు జిల్లా వరదయ్యపాలెంలో పోలీసులు పలుచోట్లదాడులు చేశారు.

ఈ సందర్భంగాఎస్సై పురుషోత్తం రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన దాడుల్లో ₹ లక్షల విలువ చేసే గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 14 వ తేదీన సోమవారం బత్తులవల్లం చెక్ పోస్ట్ వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా చెన్నై పెరంబాకం నకు చెందిన విజయ్ అనే యువకుడు నుంచి 20 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఆతని నుంచి

గంజాయి తరలిస్తున్న బైక్ రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని నిందితుడ్ని అరెస్ట్ చేసినట్లు సీఐ బీవీ శ్రీనివాసులు విలేకర్ల సమావేశంలో తెలిపారు. ఈ దాడులలో ఏఎస్సై గోపి మొదలి, పొన్ను స్వామి హెడ్ కానిస్టేబుళ్లు చలపతి నాయుడు, పరందాం నాయుడు, స్పెషల్ బ్రాంచ్ నటరాజన్, ముని రాజా, సిబ్బంది మణికంఠ, గణేష్ గోవింద్ రెడ్డి, రాము, సుధీర్ పాల్గొన్నారు



103 views0 comments
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon