• Neti Charithra

Breaking.. లారీ ని ఢీకొన్న కారు.. వైసీపీ ఎమ్మెల్యే కు తప్పిన పెను ప్రమాదం..!


Breaking.. లారీ ని ఢీకొన్న కారు.. వైసీపీ ఎమ్మెల్యే కు తప్పిన పెను ప్రమాదం..!




నెల్లూరు: నేటి చరిత్ర


ఓ ఎమ్మెల్యే ప్రయాణిస్తున్న కారు ఎదురుగా ఉన్న లారీ ని ఢీ కొనడంతో వైసీపీ ఎమ్మెల్లెకు తృటి లో పెను ప్రమాదం తప్పిన ఘటన నెల్లూరు జిల్లా లో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.

నాయుడుపేట – గూడురు వైసీపీ ఎమ్మెల్యే వరప్రసాద్ ప్రయాణిస్తోన్న కారు ప్రమాదానికి గురైంది. చెన్నై నుంచి గూడురుకు

వస్తుండగా నాయుడుపేట వద్ద ఎమ్మెల్యే కారు, లారీని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ హరికి తీవ్ర గాయాలు, వరప్రసాద్‌కి స్వల్ప గాయాలు అయ్యాయి. ఈ క్రమంలో హరిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. మరోవైపు వరప్రసాద్‌ని

చికిత్స కోసం చెన్నైకి తరలించారు. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం పూర్తిగా దెబ్బ తింది. ముందు వెళ్తున్న లారీ డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు.



331 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon