• Neti Charithra

Breaking... లారీ ని ఢీకొన్న కారు.. ఘోర ప్రమాదం లో నలుగురు మృతి.. !


Breaking... లారీ ని ఢీకొన్న కారు..

ఘోర ప్రమాదం లో నలుగురు మృతి.. !




అనంతపురం: నేటి చరిత్ర


అనంతపురం జిల్లా పెనుగొండ మండలంలోని కియా పరిశ్రమ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ లారీని వెనుక నుంచి వచ్చిన కారు వేగంగా ఢీకొనడం తో నలుగురు

అక్కడికక్కడే మృతి చెందిన ఘటన అనంతపురం లో విషాదాన్ని నింపింది. పోలీసుల కథనం మేరకు..బెంగళూరు నుంచి హైదరాబాద్‌ కు నలుగురితో వెళుతున్న కారు వేగంగా వెళ్తూ

అనంతపురం కియో పరిశ్రమ మెయిన్ గేటు కు ఎదురుగా ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మృతులు రేఖ (21), అంచల్‌ సింగ్‌ (21), మహబూబ్‌ అలం (31), మనోజ్‌ మిట్టల్‌ (38) ఉన్నారు. మృతుల్లో ఒకరిది స్వస్థలం బెంగళూరు కాగా... మరో ముగ్గురు ఢిల్లీకి చెందిన వారని సమాచారం. వీరంతా కర్ణాటకలోని యశ్వంత్‌పూర్‌ నుంచి వస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.