• Neti Charithra

Breaking.. లారీని ఢీకొన్న ఇన్నోవా కారు.. ముగ్గురు మృతి.. మరో ఇద్దరి పరిస్థితి విషమం..!


Breaking.. లారీని ఢీకొన్న ఇన్నోవా కారు.. ముగ్గురు మృతి.. మరో ఇద్దరి పరిస్థితి విషమం..!




అనంతపురం: నేటి చరిత్ర


అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. మడకశిర సరిహద్దులో ఆగివున్న లారీని ఇన్నోవా కారు ఢీకొట్టిన‌ ఘటనలో కారులోని ముగ్గురు వ్య‌క్తులు

శనివారం మృతి చెందారు. ఇన్నోవా డ్రైవర్ తో సహా ఒక మహిళ ఓ చిన్నారి అక్కడికక్కడే చనిపోయారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మృతులను కర్ణాటకలోని మాధుగిరి హాస్పిటల్ కి తరలించి చికిత్స అందిస్తున్నారు.ఇన్నోవా కారు బెంగళూరు నుండి పావగడ కు వస్తున్న సమయంలో ఈ

ప్రమాదం జరిగింది. డ్రైవర్ గుడిబండ మండలం ఎన్ఆర్ రొప్పం గ్రామానికి చెందిన వ్యక్తి కాగా, మిగతా మృతులు కర్ణాటక లోని పావగడకు చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. ఈ ప్ర‌మాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు


Recent Posts

See All

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

ఈ నెల 29వ తేదీన జగనన్న విద్యా దీవెన కార్యక్రమం అమలుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం జగన్‌ అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. వివిధ పోస్టుల భర్తీతో సహా పలు అంశాలపై కేబినెట్