• Neti Charithra

Breaking.. లారీ డ్రైవర్ మృతి.. అర్ధరాత్రి శవం తో నిరసన.. ములకలచెరువు లో ఉద్రిక్తత..!


Breaking.. లారీ డ్రైవర్ మృతి..

అర్ధరాత్రి శవం తో నిరసన.. ములకలచెరువు లో ఉద్రిక్తత..!


ములకలచెరువు: నేటి చరిత్ర


చిత్తూరు జిల్లా ములకలచెరువు లో లారీ డ్రైవర్ మృత దేహంతో బాధిత కుటుంబం నిరసనకు దిగడంతో ఉద్రిక్తక నెలకొంది. ఇందుకు సంబంధించి బాధిత కుటుంబ సభ్యుల కథనం మేరకు... పిటిఎం మండలం పులికల్లు కు చెందిన లారీ డ్రైవర్ చాంద్ బాషా కొంత కాలం గా

ములకలచెరువు కు చెందిన ఎం ఎస్ ఆర్ టమోటామండి కి చెందిన టమోటా లారీని బెంగుళూరుకు తీసుకెళ్లాడు. అయితే అతను లారీ పై నుంచి కింద పడి మృతి చెందినట్లు తెలుస్తోంది. అయితే చాంద్ బాషా మృతి కి టమోటా మండి యాజమాన్యం కారణం అంటూ అర్ధరాత్రి నుంచి ములకలచెరువు మార్కెట్ యార్డు ఎదుట మృత దేహంతో ఆందోళనకు దిగటం ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ ఘటన కు సంబంధించి స్థానిక పోలీసులు విచారణ చేపట్టారు.