• Neti Charithra

Breaking..లక్ష లంచం..డిమాండ్ చేసిన మహిళా అధికారితో పాటు భర్తను కూడా అరెస్ట్ చేసిన ఏసీబీ..!


Breaking..లక్ష లంచం..డిమాండ్ చేసిన మహిళా అధికారితో పాటు భర్తను కూడా అరెస్ట్ చేసిన ఏసీబీ..!



విజయవాడ: నేటి చరిత్ర


పేద రైతు నుంచి లక్ష రూపాయలు లంచం డిమాండ్ చేసిన అటవీశాఖ మహిళా అధికారితో పాటు ఆమె భర్తను కూడా ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసిన ఘటన కృష్ణా జిల్లా జరిగింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

రెడ్డిగూడెం మండలం రుద్రవరం గ్రామానికి చెందిన జరబల ఏసు ఎ.కొండూరు మండలం చీమలపాడు రెవెన్యూ పరిధిలోని అటవీ ప్రాంతంలో రెండెకరాల భూమిలో మామిడి సాగు చేస్తున్నారు. దీనికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆర్వోఆర్‌ పట్టా మంజూరు చేయాలని బీటు ఆఫీసరు బాలసాని కనకశేషకుమారిని కొంత కాలం గా కోరుతున్నారు.అయితేఆమె భర్త

జగన్నాథం సుధాకర్‌ మధ్యవర్తిత్వం నడిపి రూ.లక్ష డిమాండ్‌ చేశారు. అడిగినంత మొత్తం ఇస్తేనే ఆర్వోఆర్‌ పట్టా మంజూరుకు ప్రతిపాదిస్తామని తేల్చిచెప్పడంతో రైతు ఏసు రెండు విడతలుగా చెల్లిస్తానని ఒప్పందం చేసుకున్నారు. మొదటి విడతగా రూ.50 వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేయడంతో పాటు ఒత్తిడి పెంచడంతో రైతు ఏసు ఏసీబీ అధికారులను సంప్రదించారు. ఎ.కొండూరులో ఆమె అద్దెకు ఉంటున్న ఇంటికి వెళ్లి ఏసు రూ.50 వేలు లంచం ఇచ్చారు. బీటు ఆఫీసర్‌ కనకశేషకుమారి ఆ మొత్తాన్ని తీసుకొని తన భర్తకు ఇచ్చి లెక్కించమని చెప్పడంతో పాటు ఈ వ్యవహారంలో అతని పాత్ర ఉందని అధికారులు నిర్ధరించారు. ఈ నేపథ్యంలో అటవీశాఖ అధికారిని తో ఈ కేసు లో భర్తను కూడా అరెస్ట్ చేసి ఏసీబీ అధికారులు రిమాండ్ కు పంపారు.