- Neti Charithra
Breaking...రూ.90 లక్షలు రుణం మంజూరు ఆయిన కుటుంబం అదృశ్యం.. చిత్తూరుజిల్లా లో కల కలం..!
Breaking...రూ.90 లక్షలు రుణం మంజూరు ఆయిన కుటుంబం అదృశ్యం.. చిత్తూరుజిల్లా లో కల కలం..!
తిరుపతి: నేటి చరిత్ర
చిత్తూరు జిల్లా తిరుపతి లో పట్టపగలు
ఓ కుటుంబానికి చెందిన మొత్తం నలుగురు అదృశ్యం కావటం సంచలనం గా మారింది. ఈ ఘటన కు సంబంధించి తిరుపతి తూర్పు పోలీస్‌స్టేషన్ సీఐ బీవీ శివప్రసాద్‌రెడ్డి కథనం మేరకు.. తిరుపతిలోని కెనడి నగర్లో శివకుమార్(42) కుటుంబంతో కలసి
జీవిస్తున్నారు. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట నుంచి పద్నాలుగేళ్ల కిందట తిరుపతికి వచ్చి స్థిరపడ్డారు. శివకుమార్ గృహ అంతర్భాగ అలంకరణ పనులు చేస్తుంటారు. అతనికి భార్య శ్రీలేఖ(38), కుమార్తెలు దీక్షితశ్రీ(14), తేజశ్రీ(11), కుమారుడు కార్తిక్ సాయి(7) ఉన్నారు. ఆదివారం మధ్యాహ్నం కుటుంబసభ్యులంతా కలిసి భోజనం చేశారు. షాపింగ్ నిమిత్తం ఇంటికి సమీపంలోని ఓ మార్ట్‌కు ముగ్గురు పిల్లలతో కలసి భార్య సుమారు 2.40 గంటలకు బయలుదేరింది. 3.25 గంటలకు మార్ట్ నుంచి బయటకు వచ్ఛి. అటు నుంచి ఆర్టీసీ బస్టాండు వరకు నడిచి వెళుతున్నట్లు సీసీ ఫుటేజీల్లో నమోదైంది. మార్ట్‌లో ఒక్కసారి
భర్తతో మాట్లాడిన శ్రీలేఖ తర్వాత చరవాణి స్విచ్ఛాఫ్‌లో ఉంది. సాయంత్రమైనా భార్యాపిల్లలు ఇంటికి రాకపోవడంతో శివకుమార్ ఫిర్యాదు చేశారు. ఇంటి నుంచి భార్యాపిల్లలు వెళ్లిపోయేందుకు ఎలాంటి విభేదాలు లేవని భర్త శివకుమార్, శ్రీలేఖ తండ్రి మురళీకృష్ణ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు లో పేర్కొన్నాడు.