- Neti Charithra
Breaking.. రూ. 50 వేలు డిమాండ్ చేసి ఏసీబీ కి చిక్కిన ఎస్ ఐ తో పాటు ఇద్దరు పోలీసులు..!
Breaking.. రూ. 50 వేలు డిమాండ్ చేసి ఏసీబీ కి చిక్కిన ఎస్ ఐ తో పాటు ఇద్దరు పోలీసులు..!
నేటి చరిత్ర: (ప్రత్యేక ప్రతిని థి)
( ఏసీబీ అధికారులకు చిక్కిన ఎస్ ఐ )
కృష్ణా జిల్లా లో రూ.50 వేలు డిమాండ్ చేసి
అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కాడు ఓ సబ్ ఇన్స్పెక్టర్..వివరాలు ఇలా ఉన్నాయి.గాంధీ నగర్ పోలీస్ స్టేషన్ ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న 2014 బ్యాచ్ కు చెందిన లక్ష్మీనారాయణ ఒక
చీటింగ్ కేసు కు సంబంధించిన కేసులో నిందితుడు వద్దనే యాభై వేలు లంచం డిమాండ్ చేసాడు. కానీ వారిద్దరి మధ్య 30 వేలకు ఒప్పందం కుదిరింది. ఆ డబ్బులను బుధవారం ఉదయం 12 గంటల ప్రాంతంలో ఇచ్చేందుకు పోలీస్ స్టేషన్ కు వచ్చాడు బాధితుడు. లక్ష్మీనారాయణ వద్ద కానిస్టేబుల్ పనిచేస్తున్న నరేష్ కు 30 వేల రూపాయల నగదు ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఆ డబ్బులను
ఎస్సై లక్ష్మీనారాయణ కు అందిస్తుండగా
ఏసీబీ అధికారులు ఎస్సై తో పాటు కానిస్టేబుల్ నరేష్ ను పట్టుకొని నగదు స్వాధీనం చేసుకున్నారు. వారిద్దరిని విచారించిన అనంతరం వారిపై కేసులు నమోదు చేసారు. ఆ తర్వాత ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు ఎసిబి డిఎస్పీ సత్యనారాయణ మీడియా కు వివరించారు.