• Neti Charithra

Breaking... రూ.20 లక్షలు లంచం డిమాండ్ చేసి ఏసీబీ కి చిక్కిన సర్పంచ్..!


Breaking... రూ.20 లక్షలు లంచం డిమాండ్ చేసి ఏసీబీ కి చిక్కిన సర్పంచ్..!


హైదరాబాదు: నేటి చరిత్ర


లంచం తీసుకుంటూ.. ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే అధికారులు.. సిబ్బంది ఏసీబీ కి పట్టు పడటం సహజం . అయితే ఈ సారి ఓ సర్పంచ్.. ఏకంగా రూ. 20 లక్షలు లంచం డిమాండ్ చేసి ఏసీబీ కి చిక్కిన ఘటన సంచలనం గా మారింది

ఏసీబీ అధికారుల కథనం మేరకు..

వికారాబాద్‌ జిల్లా పూడూరు మండలం

మన్నెగూడ గ్రామ పంచాయతీ పరిధిలో మహబూబ్ ఆలంఖాన్ అనే వ్యక్తికి 5 ఎకరాల భూమి ఉంది. జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న తన స్థలంలో లే అవుట్‌ వేసేందుకు అనుమతి కోరుతూ మన్నెగూడ గ్రామ పంచాయతీలో దరఖాస్తు చేసుకున్నాడు. వెంచర్‌కు అనుమతి ఇవ్వాలంటే రూ.20 లక్షలు ఇవ్వాలని సర్పంచ్‌ వినోద్‌ గౌడ్‌ డిమాండ్‌ చేశాడు. రూ.15 లక్షలు ఇస్తానని ఒప్పుకున్న ఆలంఖాన్‌ వెంటనే ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. హైదరాబాద్‌ అప్పా కూడలి వద్ద రూ.13 లక్షల లంచం తీసుకుంటుండగా రంగారెడ్డి జిల్లా ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ నేతృత్వంలోని బృందం వినోద్‌ గౌడ్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.