• Neti Charithra

Breaking.. రూ.18 లక్షల కోసం..మదనపల్లె లో కిడ్నాప్.. ఓ అధికారి తోపాటు ముగురిపై కేసు నమోదు..!



Breaking.. రూ.18 లక్షల కోసం..మదనపల్లె లో కిడ్నాప్.. ఓ అధికారి తోపాటు ముగురిపై కేసు నమోదు..!


మదనపల్లె: నేటి చరిత్ర


చిత్తూరు జిల్లా మదనపల్లె మండలం వలసపల్లె లో ఓ వ్యక్తి కిడ్నాప్ కావడం తో ఓ ఉద్యోగితో పాటు మరి కొందరిపై తాలుకా పోలీసులు కేసు నమోదు చేయడం స్థానికంగా సంచలనం కలిగిస్తోంది. ఇందుకు సబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. వలసపల్లెకు చెందిన శ్రీరాములు కు మదనపల్లె కు చెందిన మున్సిపల్ ఉద్యోగి ఆర్ ఐ శ్రీనివాసులు కు ఆర్థిక లావాదేవీలు ఉన్నాయి. గత కొద్ది రోజులుగా వీరి మద్య వివాదం జరుగుతోంది. అధికారికి రూ.18 లక్షల విషయం లో శ్రీరాములు ఇవ్వాల్సి ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మంగళవారం ప్రత్యర్థులు శ్రీరాములును కారు లో కిడ్నప్ చేసారని కుటుంబ సభ్యులు తాలుకా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో స్థానిక పోలీసులు మున్సిపల్ ఆర్ ఐ శ్రీనివాసులు తో పాటు మరో ముగ్గురు పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భూముల క్రయ విక్రయాలకు సంబంధించి ఈ కిడ్నాప్ వివాదం నెలకొని ఉన్నట్లు తెలుస్తోంది. ...

అయితే ఆర్థిక లావాదేవీలు విషయమై తమకు రావాల్సిన డబ్బు విషయం

చర్చించేందుకు వచ్చిన శ్రీరాములు చెల్లింపుకు కొంత సమయం తీసుకొని వెళ్ళిపోయాడని .. కేవలం తమను బెదిరించటాని కే కేసు పెట్టారని ప్రత్యర్ధులు వాపోతుండటం గమనార్హం.


Recent Posts

See All

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

ఈ నెల 29వ తేదీన జగనన్న విద్యా దీవెన కార్యక్రమం అమలుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం జగన్‌ అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. వివిధ పోస్టుల భర్తీతో సహా పలు అంశాలపై కేబినెట్