• Neti Charithra

Breaking.. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు మదనపల్లె లో అపూర్వ స్వాగతం పలికిన నేతలు..!


Breaking.. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు మదనపల్లె లో అపూర్వ స్వాగతం పలికిన నేతలు..!



మదనపల్లె: నేటి చరిత్ర


రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆదివారం చిత్తూరు జిల్లా పర్యటన లో భాగంగా

మదనపల్లె కు చేరుకున్నారు. బెంగళూరు నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో వచ్చిన ఆయనకు చిప్పిలి హెలిపాడ్‌ వద్ద సీఎం జగన్ మోహన్ రెడ్డి డిప్యూటీ సీఎం నారాయణ స్వామి రెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి లతో కలిసిఘన స్వాగతం పలికారు. అక్కడ నుంచి బయలుదేరి


(మదనపల్లె లో రాష్ట్రపతి కి

ఘన స్వాగతం పలికిన సీఎం జగన్ మోహన్ రెడ్డి తదితరులు)



మదనపల్లె సమీపంలోని సత్సంగ్‌ ఫౌండేషన్‌ వద్దకు రాష్ట్రపతి చేరుకున్నారు. అక్కడ భారత్‌ యోగా విద్యా కేంద్రాన్ని ప్రారంభించి అనంతరం

సత్సంగ్‌ విద్యాలయాన్ని సందర్శించి, విద్యార్థులతో ముఖాముఖిలో




కార్యక్రమం లో పాల్గొన్నారు.

తర్వాత 38 పడకల స్వస్థ ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం లో హాజరు అయ్యారు. మధ్యాహ్నం భోజనం అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు సదుం మండలం పీపుల్స్‌గ్రోవ్‌ స్కూలుకు చేరుకుని

విద్యార్థులతో భేటీ కానున్నారు. కార్యక్రమం లో స్థానిక ఎమ్మెల్యే నవాజ్ బాషా , తంబల్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి లతో పాటు జిల్లా కు చెందిన పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఐజీ శశిధర్ , డీఐజీ క్రాంతి రానా టాటా, జిల్లా ఎస్పీ సెంథిల్ కుమార్ పర్యవేక్షణలో పోలీస్ భారీ బందోబస్తు ను ఏర్పాటు చేశారు.