• Neti Charithra

Breaking.. రాష్ట్రపతి రాం నాథ్ కోవింద్ చిత్తూరు జిల్లా పర్యటనపై..స్పష్టత ఇచ్చిన రాష్ట్రపతి భవన్..!


Breaking.. రాష్ట్రపతి రాం నాథ్ కోవింద్

చిత్తూరు జిల్లా పర్యటనపై..స్పష్టత ఇచ్చిన రాష్ట్రపతి భవన్..!



నేటి చరిత్ర:( ప్రత్యేక ప్రతిని థి)


భారత రాష్ట్రపతి రాంనాథ్ కోవిద్

చిత్తూరు జిల్లా పర్యటన ఖరారు అయినట్లు రాష్ట్రపతి భవన్ అధికారులు ప్రకటించారు.

ఫిబ్రవరి 7న రానున్న రాష్ట్రపతి చిత్తూరు

జిల్లాకు రానున్నారు. వైమానిక దళానికి చెందిన హెలికాప్టర్‌లో ఫిబ్రవరి 7న మధ్యాహ్నం 12;10 గంటలకు మదనపల్లికి

ఆయనచేరుకోనున్నారు. 12:30 గంటలకు స్థానిక ముంతాజ్ అలీ

(రాష్ట్రపతి పర్యటన కు సబంధించి అధికారులతో సమీక్షిస్తున్న ఇంచార్జ్

కలెక్టర్ మార్కండేయులు)


మెడిటేషన్ఆశ్రమం చేరుకొని వివిధ కార్యక్రమాల్లో రాష్ట్రపతి పాల్గొననున్నారు. అనంతరం 3:20కు మదనపల్లి నుంచి బయలుదేరి 3:40 సదుం చేరుకొంటారు. అక్కడ పీపుల్ గ్రూప్ విద్యాలయం లో ఉపాధ్యాయులు, విద్యార్థుల తో భేటీ కానున్నారు. ఆతర్వాత అక్కడినుంచి 4:50 గంటలకు బెంగుళూరుకు బయలుదేరుతారు. కాగా రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను శనివారం జిల్లా అధికారులు

మదనపల్లె, సదుం లలో

పర్యవేక్షించారు.