• Neti Charithra

Breaking.. రైల్వే క్రషర్ వద్ద పేలుడు.. అనంతపురం జిల్లా వాసులు ముగ్గురు మృతి..!


Breaking.. రైల్వే క్రషర్ వద్ద పేలుడు.. అనంతపురం జిల్లా వాసులు ముగ్గురు మృతి..!



నేటి చరిత్ర:(ప్రత్యేక ప్రతిని థి)


కర్ణాటక లో జరిగిన పేలుడు ప్రమాదం లో

ఏపీ కి చెందిన ముగ్గురు యువకులు మృతి చెందడం విషాదాన్ని నింపింది. ఈ ఘటన కు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

కర్ణాటక ప్రాంతమైన శివ మొగ్గ జిల్లా హునసోదు గ్రామ శివార్లలోని రైల్వే క్రషర్ వద్ద పేలుడు సంభవించి గురువారం రాత్రి జరిగిన ప్రమాదంలో అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణానికి చెందిన ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. రాయదుర్గం పట్టణానికి చెందిన గొల్ల పవన్, గొల్ల రాజు,జావిద్ అనే వ్యక్తులు మృతి చెందారు. రాయదుర్గం పట్టణానికి చెందిన శ్రీరాములు అనే వ్యక్తికి అనంతపురం జిల్లా తోపాటు కర్ణాటక ప్రాంతాలకు పేలుడు పదార్థాలు సరఫరా చేస్తాడు. శ్రీరాములు వద్ద పట్టణానికి చెందిన గొల్ల పవన్, జావిద్ గొల్ల రాజులు పని చేస్తారు.పేలుడు పదార్థాలు ఒక ప్రాంతానికి ప్రాంతంలోని క్వారీలకు సరఫరా చేసేందుకు ముగ్గురు గురువారం రాయదుర్గం పట్టణం నుంచి కర్ణాటక బయల్దేరి వెళ్లారు. కర్ణాటక ప్రాంతంలోని షిమోగా సమీపంలోని ఓ క్వారీ వద్ద ప్రమాదవశాత్తు పేలుడు పదార్థాలు పేలి ముగ్గురూ సంఘటన స్థలంలోనే మృతి చెందారు. రాయదుర్గం పట్టణం లోని సిద్దేశ్వర కాలనీకి చెందిన గొల్ల పవన్ తాసిల్దార్ రోడ్ ప్రాంతానికి చెందిన జావిద్ గా పోలీసులు గుర్తించారు. గొల్ల రాజు చిరునామ తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు