• Neti Charithra

Breaking.. రైలు కింద పడి గ్రామ వాలంటీర్ మృతి.. ఆత్మహత్య చేసుకున్నడేమో..?


Breaking.. రైలు కింద పడి

గ్రామ వాలంటీర్ మృతి.. ఆత్మహత్య చేసుకున్నడేమో..?ఏలూరు: నేటి చరిత్ర


రైలు ఢీకొనటం తో ఓ గ్రామ వాలంటీర్

మృతి చెందిన ఘటన కృష్ణా జిల్లాలో చోటు చేసుకుంది. రైల్వే పోలీసుల కథనం మేరకు.. నూజివీడు రైల్వే స్టేషన్‌ సమీపంలో నూజివీడు మండలం మొకాస నరసన్నపాలెం గ్రామానికి చెందిన బోయపాటి రవీంద్రకుమార్‌ (35) రైలు కిందపడి మరణించాడు. ఇతను పట్టాలు దాటుతుండగా ప్రమాదవశాత్తు రైలు ఢీకొని మృతి చెందాడా .. రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడా.. అనేది తెలియాల్సి ఉంది. రైల్వే పోలీసులు ఘటన స్థలానికి వెళ్లి మృతుడి వద్దనున్న ఆధార్‌, ఇతర కార్డుల ఆధారంగా వివరాలను తెలుసుకున్నారు. మృతదేహాన్ని ఏలూరు ప్రభుత్వాసుపత్రి మార్చురీకి తరలించారు. రైల్వే ఎస్సై చంద్రశేఖర్‌ కేసు దర్యాప్తు చేస్తున్నారు.