• Neti Charithra

Breaking.. రైలు కింద పడి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి..!


Breaking.. రైలు కింద పడి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి..!



కర్నూలు: నేటి చరిత్ర

కర్నూలు జిల్లా పాణ్యం సమీపం లో మంగళవారం ఘోర ప్రమాదం జరిగింది. రైలు కింద పడి మహిళతో సహా నలుగురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. రైలు పట్టాలపై చెల్లాచెదురుగా మృతదేహాలు పడి ఉన్నాయి. వీరంతా ఒకే కుటుంబానికి

చెందిన వారిగా పోలీసులు భావిస్తున్నారు. అర్థిక కారణాలతోనే చనిపోయారా? లేదా ఇంకేమైనా కారణాలున్నాయా? అనే దిశగా దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలు గుర్తుపట్టలేని విధంగా

నుజ్జునుజ్జయిపోయాయి. అయితే వీరిలో ఒకరిని నంద్యాల సమీపంలోని రాజకుంటకు చెందిన అబ్దుల్‌ కలాంగా భావిస్తున్నారు. రైల్వే పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


399 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon