• Neti Charithra

Breaking.... రైలు ఇంజన్ పై సెల్ఫీ తీసుకుంటూ.. 14 ఏళ్ల బాలుడు మృతి..!



Breaking.... రైలు ఇంజన్ పై సెల్ఫీ తీసుకుంటూ.. 14 ఏళ్ల బాలుడు మృతి..!



నేటి చరిత్ర: (ప్రత్యేక ప్రతిని థి)



రైలు ఇంజిన్‌పై సెల్ఫీ తీసుకుంటున్న బాలుడు విద్యుదాఘాతంతో మృతి చెందిన ఘటన దక్షిణ తమిళనాడులోని తిరునెల్వేలిలో గురువారం జరిగింది.




పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తొమ్మిదో తరగతి చదువుతున్న జ్ఞానేశ్వరన్‌ (14) ఉదయం తండ్రితో కలిసి తిరునెల్వేలి రైల్వే స్టేషన్‌కు  వెళ్లాడు. ఈ క్రమంలో


బాలుడు రైల్వే జంక్షన్‌లో ఆగి ఉన్న రైలు ఇంజిన్‌పైకి ఎక్కి సెల్ఫీ తీసుకుంటూ పైన ఉన్న కరెంటు తీగలను పట్టుకోవడంతో విద్యుదాఘాతానికి గురయ్యాడు.  దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. బాలుడి తండ్రి అదే  రైల్వే స్టేషన్‌లో పౌర సరఫరాల శాఖ ప్రభుత్వ ఉద్యోగి. బాలుడి తండ్రి విధుల్లో ఉండగానే ఈ ఘటన జరిగింది.