• Neti Charithra

Breaking.. రూ.లక్ష లంచం.. తీసుకుంటూ..మదనపల్లె లో అరెస్ట్ అయిన రెవిన్యూ అధికారి..!


Breaking.. రూ.లక్ష లంచం.. తీసుకుంటూ..మదనపల్లె లో అరెస్ట్ అయిన రెవిన్యూ అధికారి..!


మదనపల్లె: నేటి చరిత్ర


(ఏసీబీ కి పట్టుపడ్డ విరవి గంగాధర్)


చిత్తూరు జిల్లా మదనపల్లె లో ఏసీబీ అధికారులు శనివారం దాడులు చేశారు. ఈ సందర్భంగా తహసిల్దార్ కార్యాలయం లో ఓ రైతు నుంచి లక్ష లంచం తీసుకుంటుండగా నిఘా పెట్టిన ఏసీబీ

అధికారులు విఆర్వో గంగాధర్ ను అదుపులోకి తీసుకున్నారు. తన భూమి వివరాలు ఆన్ లైన్ లో పెట్టేందుకు భారీగా నగదు డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. బసినికొండ కు చెందిన రైతు రామకృష్ణ నుంచి లంచం తీసుకుంటూ పట్టుపడటం తో గంగాధర్ ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు.


ఏసీబీ అధికారులు ఏమన్నారంటే..!


బసినికొండగ్రామానికి చెందిన రామకృష్ణ అనే రైతుకు 1.87ఎకరాల భూమి ఉంది. ఈ భూమిని ఆన్‌లైన్‌ చేసేందుకు రామకృష్ణ మండల రెవెన్యూ ఆఫీసులో దరఖాస్తు చేసుకున్నారు. ఇందుకోసం గత కొంతకాలంగా బాధిత రైతు వీఆర్వో చుట్టూ తిరుగుతున్నారు. భూమిని ఆన్‌లైన్‌ చేసేందుకు గాను వీఆర్వో రైతు నుంచి రూ.10లక్షలు డిమాండ్‌ చేయగా.. కొంత మంది మధ్యవర్తులు జోక్యం చేసుకొని రూ.5లక్షలకు ఒప్పందం కుదిర్చారు. ముందుగా రూ.లక్ష ఇచ్చేందుకు అంగీకారం కుదరగా.. బాధిత రైతు రామకృష్ణ తిరుపతి ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఈ క్రమంలో శనివారం వీఆర్వోకు బాధిత రైతు రూ.లక్ష ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. దాడుల్లో

తిరుపతి ఏఎస్పీ శ్రీనివాస్‌, డీఎస్పీ అల్లాభక్ష్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు