• Neti Charithra

Breaking.. రాయలసీమ లో విగ్రహాలు ధ్వంసం చేస్తున్న ముఠా ను పట్టుకున్న చిత్తూరు పోలీసులు!



Breaking.. రాయలసీమ లో విగ్రహాలు ధ్వంసం చేస్తున్న ముఠా ను పట్టుకున్న చిత్తూరు పోలీసులు!





చిత్తూరు: నేటి చరిత్ర


( విగ్రహాలు ధ్వంసం చేస్తున్న ముఠా ను అరెస్ట్ చేసిన చిత్తూరు పోలీసులు)


రాయలసీమ జిల్లాల్లో పురాతన ఆలయాలు లక్ష్యంగా గుప్త నిధుల కోసం ధ్వంసం చేస్తున్న మూత సభ్యులను చిత్తూరు జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. చిత్తూరు జిల్లా ఎస్పీ సింథిల్ కుమార్ కథనం.. మేరకు..

జిల్లా లోని కాణిపాకం, ఎస్ ఆర్ పురం లలో పలు ఆలయాల్లో గుప్తనిధుల కోసం ఓ ముఠా నంది విగ్రహాలను ధ్వంసం చేసింది. స్థానికులు ఆయా పోలీస్ స్టేషన్ లలో ఫిర్యాదు చేశారు. ఈ కేసులో అనుమానితులను అదుపు లోకి తీసుకున్న పోలీసుల విచారణలో నిందితులు విస్తుపోయే విషయాలు వెల్లడించారు. వీరు మంత్రాలయం, మహానంది, పత్తికొండ,

పెనుగొండ, కదిరి లతో పాటు గుంటూరు జిల్లాలో కూడా విగ్రహాలు ధ్వంసానికి ప్రణాళికలు సిద్ధం చేసుకున్న సమాచారాన్ని పోలీసుల విచారణలో తేలింది. ముఠా లో కీలక నిందితుడు సోమశేఖర్ తో పాటు మొత్తం ఎనిమిది మంది ముఠా సభ్యులను అరెస్ట్ చేసినట్లు మీడియాకు వివరించారు