• Neti Charithra

Breaking.. కుప్పం.. ఆర్టీసీ బస్సులో పోలీసుల దాడులు..పట్టుపడ్డ రూ.1.90 కోట్ల నగదు ..!


Breaking.. కుప్పం.. ఆర్టీసీ బస్సులో

పోలీసుల దాడులు..పట్టుపడ్డ రూ.1.90 కోట్ల నగదు ..!కర్నూలు:నేటి చరిత్ర


కర్నూలు జిల్లాలో ఆర్టీసీ బస్సు లో తరలిస్తున్న నగదును స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు దాడులు చేసి సీజ్ చేశారు.హైదరాబాదు నుంచి కుప్పం కు వస్తున్న ఆర్టీసీ బస్సు కర్నూలు జిల్లా

పంచలిగాల చెక్ పోస్టు దగ్గర ఆదివారం ఉదయంపోలీసులు తనిఖీలు నిర్వహించారు. బస్సు లో తరలిస్తున్న రూ. 1.9 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. ఎటువంటి ఆధారాలు లేకపోవడంతో నగదును పోలీసులు సీజ్‌ చేశారు.

అనంతపురం జిల్లాకు చెందిన రామచౌదరి నగదుగా గుర్తించారు. ఈ నగదు ఎక్కడి నుండి ఎక్కడికి తరలిస్తున్నారనే కోణంలో పోలీసులుకేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు.