• Neti Charithra

Breaking..రైతుల వద్ద లక్ష..లంచం తీసుకుంటూ.. ఏసీబీ కి పట్టుపడ్డ విద్యుత్ లైన్ మ్యాన్..!


Breaking.. రైతుల వద్ద లక్ష..లంచం తీసుకుంటూ.. ఏసీబీ కి పట్టుపడ్డ విద్యుత్ లైన్

మ్యాన్..!



దర్శి : నేటి చరిత్ర


రైతుల వద్ద నుంచి లంచం తీసుకుంటూ ఓ లైన్‌మెన్‌ అనిశా అధికారులకు పట్టుపడిన ఘటన ప్రకాశం జిల్లా లో చోటు చేసుకుంది.

వివరాలు ఇలా ఉన్నాయి. దర్శి మండలంలోని రాజంపల్లి గ్రామానికి చెందిన 9 మంది రైతులు తమ పొలాల వద్ద రెండు విద్యుత్‌ ట్రాన్స్‌ఫారాలను ఏర్పాటు చేయడానికి గ్రామ లైన్‌మెన్‌ లక్షీనాయక్‌ను సంప్రదించారు.

దీంతో లైన్‌మెన్‌ ట్రాన్స్‌ఫారాల ఏర్పాటుకు


(లంచం తీసుకుంటూ ఏసీబీ కి చిక్కిన లైన్ మాన్)


రైతుల నుంచి రూ.1.01 లక్షలు డిమాండ్‌ చేశాడు. గత నెల 10, 11 తేదీల్లో రెండు దఫాలుగా రైతుల నుంచి రూ.50 వేలు తీసుకున్నాడు.మిగిలిన రూ.51 వేలను రైతు సబ్బారావు ఇంటి వద్ద తీసుకుంటుండగా, ముందస్తు సమాచారంతో అనిశా అధికారులు లైన్‌మెన్‌ నాయక్‌ను అదుపులోకి తీసుకున్నారు.దాడుల్లో డీఎస్పీ ఎం.సూర్యనారాయణ రెడ్డి, సీఐలు వెంకటేశ్వర్లు, రమేశ్‌బాబు, సిబ్బంది పాల్గొన్నారు.


228 views0 comments
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon