• Neti Charithra

Breaking... రైతుల కు వేధింపుల పై ఫిర్యాదులు..బి కొత్తకోట తహసిల్దార్ పై విచారణ..కు ఆదేశించిన ప్రభుత్వ



Breaking... రైతుల కు వేధింపుల పై ఫిర్యాదులు..బి కొత్తకోట తహసిల్దార్ పై విచారణ..కు ఆదేశించిన ప్రభుత్వం..!


బి కొత్తకోట: నేటి చరిత్ర



చిత్తూరు జిల్లా బి కొత్తకోట తహసిల్దార్ పై

ఉన్నతాధికారులువిచారణకు ఆదేశించారు. ఇందుకు సంబంధించి న వివరాలు ఇలా ఉన్నాయి. బి కొత్తకోట మండలం లో 11 రెవిన్యూ గ్రామాలు ఉండగా రైతులు వివిధ సస్యల పరిష్కారం కోసం భూములు ఆన్ లైన్ కోసం వన్ బీలు, అదంగల్, భూముల సర్వే, పాసు బుక్కుల మార్పులు, చేర్పులు కోసం వచ్చిన మీసేవ దరఖాస్తులు వేల సంఖ్యలో రాగ, వాటిని పరిష్కరించే విషయం లో



నిర్లక్ష్యం వహిస్తూ లంచాలు కోసం.. వేధిస్తూ

పెద్దఎత్తున దరఖాస్తులు తిరస్కరిస్తున్నారని ఉద్దేశం పూర్వకంగా రెవిన్యూ అధికారులు ఇలా చేస్తున్నారని వచ్చిన ఫిర్యాదు మేరకు.. తహసిల్దార్ టూ పాటు అందరూ విఆర్వోలు జనవరి 2 న మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయం లో జరిగే విచారణకు హాజరు కావాలని ఉన్నతాధికారులు నోటీసులు జారీ చేయడం రెవిన్యూ వర్గాల్లో కల కలం రేపుతోంది.