• Neti Charithra

Breaking.. రైతు నుంచి లంచం తీసుకుంటూ.. ఏసీబీ కి చిక్కిన విద్యుత్ ఉద్యోగి..!


Breaking.. రైతు నుంచి లంచం తీసుకుంటూ.. ఏసీబీ కి చిక్కిన విద్యుత్ ఉద్యోగి..!


కడప:నేటి చరిత్ర


రైతులను వేధిస్తున్న ఓ విద్యుత్ సంస్థలో పనిచేసే ఉద్యోగి ఏసీబీ వలలో చిక్కిన ఘటన కడపజిల్లా లో నెలకొంది.సింహాద్రిపురం మండలంహిమకుంట్ల విద్యుత్తు ఉపకేంద్రం పరిధిలో పనిచేస్తున్న సహాయ లైన్‌మేన్‌ (ఏఎల్‌ఎం) ఖాదర్‌వలీ ఓ రైతు నుంచి లంచం తీసుకొంటుండగా ఏసీబీ డీఎస్పీ ఖాజాఖాన్‌ ఆధ్వర్యంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు పట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే...హిమకుంట్ల గ్రామానికి చెందిన రామగౌని లోకేష్‌గౌడ్‌ పిన్ని లక్ష్మిదేవి పొలం వద్ద విద్యుత్తు సర్వీసు ఏర్పాటు చేసేందుకు లంచం ఇవ్వాలంటూ సదరు ఏఎల్‌ఎం వేధిస్తుండటంతో విసిగిపోయిన బాధితుడు కడప ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దీంతో వారు బాధితుడి నుంచి ఏఎల్‌ఎం రూ.4,000లను తీసుకొంటుండగా అదుపులోకి తీసుకొని అరెస్టు చేశారు. చాలా కాలం నుంచి సర్వీసు ఏర్పాటు చేయాలని కోరుతున్నా ఏఎల్‌ఎం లంచం డిమాండు చేస్తున్నారని దింతో ఏసీబీ ని ఆశ్రయించనని బాధితుడు పెర్కొన్నాడు.ప్రభుత్వ అధికారులు ప్రజలకు పనులు చేయకుండా లంచం కోసం వేధిస్తుంటే తమకు సమాచారం అందివ్వాలని ఏసీబీ డీఎస్పీ ఖాజాఖాన్‌ కోరారు. దాడుల్లో

ఏసీబీ ఇన్‌స్పెక్టర్లు రామాంజనేయులు, రెడ్డప్ప, శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.