• Neti Charithra

Breaking.. రైతు నుంచి పాతిక వేల లంచం తీసుకుంటూ.. ఏసీబి కి చిక్కిన రెవిన్యూ అధికారి..!


Breaking.. రైతు నుంచి పాతిక వేల లంచం తీసుకుంటూ.. ఏసీబి కి చిక్కిన రెవిన్యూ అధికారి..!


విశాఖపట్నం: నేటి చరిత్ర


రైతు నుంచి వ్యవసాయ పాస్ బుక్కు కోసం.. పాతిక వేల లంచం తీసుకుంటూ.. ఓ విఆర్వో ఏసీబీ అధికారులకు పట్టు పడిన విశాఖ జిల్లాలో చోటుచేసుకుంది.

డీఎస్పీ రంగరాజు కథనం మేరకు..

జిల్లేడిపూడికి చెందిన రైతులు వర్రె రమణ, గోవిందు కుటుంబాలకు చెందిన భూములకు సంబంధించి మ్యుటేషన్‌ చేయించి పాసుపుస్తకాలు ఇచ్చేందుకు వీఆర్వో రమణ రూ. 30 వేలు డిమాండ్‌ చేసి రూ. 25 వేలకు ఒప్పందం చేసుకున్నాడు. బాధిత రైతు రమణ

ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో .చెర్లోపాలెంలోని తన ఇంటివద్ద గురువారం సాయంత్రం రమణ రైతు వద్ద

రూ. 25 వేలు తీసుకుంటుండగా ఏసీబీ

అధికారులు రంగప్రవేశం చేశారు. వారిని చూసి ఆయన పారిపోయేందుకు యత్నించగా.. పట్టుకున్నట్లు డీఎస్పీ రంగరాజు చెప్పారు. శుక్రవారం వీఆర్వో రమణను కోర్టుకు హాజరు పరచనున్నట్లు పేర్కొన్నారు.


Recent Posts

See All

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

ఈ నెల 29వ తేదీన జగనన్న విద్యా దీవెన కార్యక్రమం అమలుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం జగన్‌ అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. వివిధ పోస్టుల భర్తీతో సహా పలు అంశాలపై కేబినెట్