• Neti Charithra

Breaking..రుణ భారం..రెండు కుటుంబాలను ఛిద్రం..చేసింది. భార్యా.. భర్త..అన్నా.. చెల్లి ఆత్మహత్య..!


Breaking..రుణ భారం..రెండు కుటుంబాలను ఛిద్రం..చేసింది. భార్యా.. భర్త..అన్నా.. చెల్లి ఆత్మహత్య..!



మంచిర్యాల: నేటి చరిత్ర


ముందే..మధ్యతరగతి కుటుంబం.. ఆపై అప్పులు.. పంటల సాగులో నష్టం..

అందులో రుణం ఇచ్చిన వ్యక్తుల ఒత్తిడి..

సమాజం లో పరువు పోతుందేమోనని అనుమానం తో ఓ కుటుంబం లో నలుగురు ఆత్మహత్య చేసుకున్న ఘటన మంచిర్యాల జిల్లాలో పెను విషాదాన్ని నింపింది. ఇందుకు సంబంధిన వివరాలు ఇలా ఉన్నాయి. కాసిపేట మండలం మల్కపల్లి గ్రామానికి చెందిన జంజీరాల రమేష్‌ (45), పద్మ (40)లకు ఇద్దరు పిల్లలు. కుమార్తె సౌమ్య (20), కుమారుడు అక్షయ్‌ (17). రమేష్‌ భూమిని కౌలుకు తీసుకొని పత్తి సాగు చేస్తున్నారు. ఏడాదిక్రితం కుమార్తె పెళ్లిని ఘనంగా చేశారు. గతంలో ఉన్న అప్పులతో పాటు పెళ్లికి చేసిన అప్పులు తీరాలంటే రెట్టింపు స్థాయిలో కష్టపడాలనుకున్నారు. దీంతో మరికొంత నగదును అప్పుగా తీసుకొని గ్రామంలో 30 ఎకరాల భూమిని కౌలుకు తీసుకున్నారు. రెక్కల కష్టానికి ఫలితం దక్కి పంట పండితే తెచ్చిన రూ.16 లక్షల అప్పు తీరుతుందని భావించారు. పెట్టుబడి ఖర్చులు కూడా రాకపోవడంతో అప్పు భారం పెరిగింది. ఏం చేయాలో తోచక కుమారుడితో పాటు భార్యభర్తలిద్దరూ చనిపోవాలని అనుకున్నారు. చివరిసారిగా కుమార్తెను చూడాలనుకొని రమేష్‌ రెండు రోజుల కిందట ఇంటికి తీసుకొచ్చారు. ఆమెకు తమ నిర్ణయాన్ని వివరించారు. ‘‘మీరు లేని జీవితం నాకెందుకు.. నేను మీతోనే బతికాను.. మీతోనే చనిపోతాను’’ అంటూ కుమార్తె కూడా వాళ్ల నిర్ణయానికి తోడైంది. ‘రూ.16 లక్షల అప్పు ఉంది.. ఇల్లు అమ్మినా ఇంకా రూ.8 లక్షల అప్పు ఉంటుంది. ఈ నెల 25న గురువారం అప్పు చెల్లించాల్సి ఉంది. దీంతో ఏం చేయాలో తోచక ఆత్మహత్య చేసుకుంటున్నాం’ అని లేఖ రాసి గోడకు అతికించి బుధవారం రాత్రి బలవన్మరణానికి పాల్పడ్డారు. రూ. 16 లక్షల అప్పు రెండు కుటుంబాలను చిదిమేసింది.