• Neti Charithra

Breaking..రేణిగుంట రైల్వే స్టేషన్ లో బ్లేడుతో గొంతు కోసుకున్న మహిళ..!


Breaking..రేణిగుంట రైల్వే స్టేషన్ లో బ్లేడుతో గొంతు కోసుకున్న మహిళ..!



రేణిగుంట: నేటి చరిత్ర


రైల్వే స్టేషన్ లో ఓ మహిళ బ్లేడుతో గొంతు కేసు కొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం చిత్తూరు జిల్లా రేణిగుంట లో కలకలం రేపింది. రైల్వే యస్ ఐ అనీల్

సమయస్ఫూర్తి తో బాధిత మహిళకు సేవలు అందించారు. వివరాలు ఇలా ఉన్నాయి.

రేణిగుంట రైల్ వే స్టేషన్ ఫ్లాట్ ఫామ్ బల్ల పై గుర్తు తెలియని మహిళ బెడుతో గొంతు కోసుకుంది... ఇది గమనించి ఎస్ ఐ బలవంతం గా బ్లేడు లాక్కున్నాడు.. అప్పటికే చాలా రక్త స్రావం జరిగి మాట్లాడ లేని స్థితికి చేరుకుంది... ఎస్ ఐ ఎన్ని రకాలుగా వివరాల కోసం ప్రయత్నించినా ఫలితం కనిపించలేదు. రక్త స్రావం

ఆగడానికి కోసుకున్న చోట అంబులెన్స్ వచ్చేవరకు రక్త స్రావం ఆగడానికి అలాగే గుడ్డతో గట్టిగా పట్టి వుంచారు... 108 అంబులెన్స్ వచ్చాక ఆమె ను తనే దగ్గర ఉండి చికిత్స నిమిత్తం రుయా ఆస్పత్రి కి పంపించారు.తాను అనాధ అని ఆరోగ్యం సరిగా లేని కారణం గా ఇలా చేశానని ఆమె వద్ద లభించిన లేఖలో వుంది....

ఆమె వద్ద ఉన్న ఫోన్ నంబర్ ద్వారా

వివరాలు తెలుసుకునే పని లో పోలీసులు నిమగ్న మయ్యారు.