• Neti Charithra

Breaking.. రెండు వాహనాలు ఢీ.. ముగ్గురు మృతి..!


Breaking.. రెండు వాహనాలు ఢీ.. ముగ్గురు మృతి..!



వరంగల్: నేటి చరిత్ర


రెండు వాహనాలు ఢీకొనడంతో ముగ్గురు మృతి చెందిన ఘటన వరంగల్ జిల్లా లో చోటుచేసుకుంది. పోలీసులు కథనం మేరకు..కూలీలతో వెళ్తున్న ఓ ఆటోను తుఫాను వాహనం ఢీకొట్టడంతో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. జిల్లాలోని ఆత్మకూరు మండలం నీరుకుళ్ల గ్రామం శివారులో శుక్రవారం ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆటో పూర్తిగా నుజ్జునుజ్జు అయ్యింది. ప్రమాద ధాటికి శరీర భాగాలు తెగిపడ్డాయి. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.