• Neti Charithra

Breaking.. రాజధాని ఎక్స్ ప్రెస్ రైలు లో..మంటలు.. భయం తో పరుగులు పెట్టిన ప్రయాణికులు..!


Breaking.. రాజధాని ఎక్స్ ప్రెస్ రైలు లో..మంటలు.. భయం తో పరుగులు పెట్టిన ప్రయాణికులు..!



నేటి చరిత్ర: (ప్రత్యేక ప్రతిని థి)


రాజధాని ఎక్స్ ప్రెస్ రైలులో మంటలు ఎగిసి పడ్డంతో ప్రయాణికులు అరుపులు కేకలతో దద్దరిల్లిన ఘటన ఆదివారం రాత్రి వికారా బాద్ జిల్లాలో కల కలం రేపింది.దిల్లీ నుంచి బెంగళూరు వెళ్తుండగా వికారాబాద్‌ జిల్లా పరిధిలో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న రైల్వే అధికారులు నవాంద్గి రైల్వే స్టేషన్‌ వద్ద రైలును నిలిపివేశారు. అక్కడి రైల్వే సిబ్బంది, తాండూరు అగ్నిమాపక సిబ్బంది వచ్చి రైలు కిటికీలు పగలగొట్టి మంటలను

ఆర్పివేశారు. రైలు ఇంజిన్‌లో షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా స్పల్పంగా మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.ఎలక్ట్రిక్‌ లోకో ఇంజిన్‌ ఓహెచ్‌ నుంచి పొగలు, మంటలు వచ్చినట్లు ద.మ.రైల్వే సీపీఆర్వో తెలిపారు. ఈ ప్రమాదం పై రైల్వే అధికారులు విచారణకు ఆదేశించారు.