• Neti Charithra

Breaking.. రేగు పండ్ల కోసం..వెళ్లి నీటి వాగులో పడి ముగ్గురు పిల్లలు మృతి..!


Breaking.. రేగు పండ్ల కోసం..వెళ్లి

నీటి వాగులో పడి ముగ్గురు పిల్లలు మృతి..!


ఒంగోలు:నేటి చరిత్రరేగు పండ్ల కోసం.. పొలాల వైపు వెళ్లిన

పిల్లలు సమీపం లోని నీటి వాగు లో పడి మృతి చెందిన ఘటన ప్రకాశం జిల్లాల్లో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.గిద్దలూరు మండలం విఠముసురపల్లెలోని సగిలేరు వాగులో పడి ముగ్గురు బాలికలు మృతి చెందారు. రేగు పండ్ల కోసం వెళ్లి బాలికలు ప్రమాదానికి

గురైయ్యారు. మృతులను వెంకట దీప్తి(13), సుప్రియ(14), సుస్మిత (10) గా గుర్తించారు. బిడ్డల మరణంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు ఈ ఘటనతో గ్రా

మంలో విషాద ఛాయలు అలముకున్నాయి.