• Neti Charithra

Breaking.. యువతి..యువకుడు..మహిళ దారుణ హత్య..కల కలం..!



Breaking.. యువతి..యువకుడు..మహిళ దారుణ హత్య..కల కలం..!


నేటి చరిత్ర: (ప్రత్యేక ప్రతిని థి)




కృష్ణా జిల్లా లోనివిస‌న్న‌పేట – విస్సన్నపేట శివారులో ముగ్గురు సంచార చిరు వ్యాపారులు అనుమానాస్పద రీతిలో మృతి చెందారు. సోమవారం ఉదయం మూడు మృతదేహాలను అక్కడి స్థానికులు

గుర్తించారు. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హత్యకు గురైన వారిలో మహిళ, యువతితో పాటు ఓ యువకుడు ఉన్నారు. మృతులు నూజివీడు మండలం కొత్త ఈదర గ్రామానికి చెందిన చిన్నస్వామి, తిరుపతమ్మ, మీనాక్షిలుగా పోలీసులు గుర్తించారు.

వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారని నిర్ధారణకు వచ్చారు. అయితే ఈ ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడ్డారా..? లేక ఎవరు హత్య చేసి ఉంటారా..? వీరి హత్యకు గల కారణాలేంటి..? అంశాల‌పై పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు.