• Neti Charithra

Breaking.. ములకలచెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి.. మరొకరి రికి తీవ్రగాయాలు..!


Breaking.. ములకలచెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి.. మరొకరి రికి తీవ్రగాయాలు..!



ములకలచెరువు: నేటి చరిత్ర


(బురకాయల కోట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం)

చిత్తూరు జిల్లా ములకలచెరువు మండలం బురకాయల కోట వద్ద సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదం లో ఒకరు మృతి చెందగా మరొకరికి గాయాలు అయ్యాయి. ఎస్ ఐ రామకృష్ణ కథనం మేరకు.. బురకాయల కోట లోని పెట్రోల్ బంకు లో పెట్రోల్ పట్టించుకొని వెళుతున్న ద్విచక్ర వాహనాన్ని ఎదురుగా వచ్చిన బులోరో వాహనం సోమవారం రాత్రి ఢీకొంది. ఈ ప్రమాదం లో తంబల్లపల్లి మండలం ఎద్దుల వారి పల్లె కు చెందిన వెంకటరమణ(55) మృతి చెందగా కదిరి మండలం కదిరి కుంట్ల వారి పల్లె కు చెందిన రామకృష్ణ కు తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.