• Neti Charithra

Breaking.. ముంబై నుంచి మదనపల్లె కు తుపాకులు..తూటాలు..రవాణ..ఉలిక్కిపడ్డ మదనపల్లె ప్రజలు..!


Breaking.. ముంబై నుంచి మదనపల్లె కు

తుపాకులు..తూటాలు..రవాణ..ఉలిక్కిపడ్డ

మదనపల్లె ప్రజలు..!


మదనపల్లె: నేటి చరిత్ర


( మదనపల్లె లో పోలీసులకు పట్టుపడ్డ

నిందితుడు..తుపాకులు)


చిత్తూరు జిల్లా మదనపల్లె

లో తుపాకులు తో పాటు బుల్లెట్లు పట్టు పడటం తో పట్టణ ప్రజలు ఉలిక్కి పడ్డారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మదనపల్లె డిఎస్పీ రవిమనోహర చారికథనం మేరకు.. పుంగనూరు నియోజకవర్గం సదుం కు చెందిన ఫరూక్ బెంగుళూరు లో వ్యాపారాలు చేస్తుంటాడు. ఇతని సోదరుడు కువైట్ లో కొన్నేళ్లుగా ఉండగా తాజాగాఫరూక్




బెంగుళూరుకు అక్రమ ఆయుధాల తరలిస్తూమదనపల్లె సరిహద్దు వెంపల్లె క్రాస్ వద్ద పోలీసుల కళ్ళుకప్పి ద్విచక్ర వాహనం లో వెళ్లే ప్రయత్నం లో సీఐ శ్రీనివాసులు, ఎస్ ఐ దిలీప్ కుమార్ లు అనుమానం తో నిందితున్ని అదుపులోకి తీసుకొని తనిఖీ చేయగ అతని వద్ద రెండు రివాల్వర్ తుపాకులు, 29 బుల్లెట్లు ను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులకీ పట్టుపడ్డ




ఫారూఖ్ ముంబాయిలో క్యాబ్ డ్రైవర్ గా పని చేస్తూ.. పలు చోట్ల గంజాయి రవాణా చేస్తున్నట్లు పోలీసులు విచారణ లో తేలింది. ఈ అక్రమ ఆయుధాల ను ముంబయి నుండి మదనపల్లె కు తీసుకొచ్చి వాటిని మళ్ళీ బెంగుళూరు కు

తరలిస్తుండగా పోలీసులకు పట్టు పడటం తో అతన్ని మంగళవారం అరెస్ట్ చేసి రెండు రివాల్వర్ లు, 29 తూటాలు స్వాధీనం చేసుకున్న ట్లు పోలీసులు మీడియాకు తెలిపారు.