• Neti Charithra

Breaking.. మున్సిపల్..ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ .. నోటిఫికేషన్ కు రంగం సిద్ధం..!


Breaking.. మున్సిపల్..ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ .. నోటిఫికేషన్ కు రంగం సిద్ధం..!



అమరావతి: నేటి చరిత్ర


గతం లో వివాదాల మధ్యఆంధ్రప్రదేశ్‌లో వాయిదా వేసిన జడ్పీటీసీ, ఎంపీటీసీ, పురపాలక సంఘాల ఎన్నికల నిర్వహణకు

ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. త్వరలో మున్సిపల్‌ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం సన్నాహాలు చేస్తోంది. త్వరలో మున్సిపల్‌ ఎన్నికల షెడ్యూల్‌ జారీ చేసే

అవకాశముంది. ఆగిన చోట నుంచే మున్సిపల్‌ ఎన్నికల ప్రక్రియ కొన

సాగించాలా.. లేక కొత్త నోటిఫికేషన్ చేయాలా అన్న విషయం పై స్పందించాల్సి ఉంది.ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో జరిగిన ఏకగ్రీవాలను రద్దు చేయాలని, మళ్లీ నోటిఫికేషన్‌ ప్రకటించాలని గతంలోనే మెజార్టీ విపక్షాలు ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ను కోరాయి. న్యాయ నిపుణుల సూచనల తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణపై ఎస్‌ఈసీ నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం.