• Neti Charithra

Breaking.. మినీ బస్సు ను ఢీకొన్న లారీ.. ఎగిసిన మంటలు.. ఇద్దరు సజీవ దహనం..!


Breaking.. మినీ బస్సు ను ఢీకొన్న లారీ.. ఎగిసిన మంటలు.. ఇద్దరు సజీవ దహనం..!



బెంగుళూరు: నేటి చరిత్ర


రహదారి పై వెళుతున్న లారీ- మినీ బస్సు ఢీకొన్న ఘటన లో ఇద్దరు సజీవ దహనం ఆయిన ఘటన కర్ణాటక లో కలకలం రేపింది. స్థానిక పోలీసులు కథనం మేరకు..

బాగల్‌కోటె జిల్లా ముధోళ్‌ తాలూకా ఉత్తూరు సమీపంలో బుధవారం సాయంత్రం మినీ బస్సు, లారీ ఢీకొనడంతో చెలరేగిన మంటల్లో ఇద్దరు సజీవంగా దహనం అయ్యారు.ఢీకొన్న వెంటనే బస్సులో మంటలు ఎగిసి పడడం తో

ప్రయాణికులు పరుగులు పెట్టారు. ఈ నేపథ్యంలోఇద్దరు సజీవ

దహనమయ్యారు. మృతులు

ఈరవ్వ గాణిగెర (70), అణ్ణవ్వ గాణిగెర (58)గా గుర్తించారు. వీరిద్దరూ బెళగావి జిల్లా యాదవాడ గ్రామానికి చెందినవారు. అథణి తాలూకా చమకేరి గ్రామానికి పెళ్లికి వచ్చిన వీరు వెనుతిరుగుతున్న సమయంలో ప్రమాదం చోటుచేసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ముధోళ్‌ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.