• Neti Charithra

Breaking..మినీ బస్సు- ట్రక్కు ఢీ: 13 మంది మృతి.. చెల్లా చెదురు ఆయిన మృత దేహాలు..!


Breaking..మినీ బస్సు- ట్రక్కు ఢీ: 13 మంది మృతి.. చెల్లా చెదురు ఆయిన మృత దేహాలు..!




నేటి చరిత్ర:(ప్రత్యేక ప్రతినిథి)


కర్ణాటకలోని ధార్వాడ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హుబ్లీ - ధార్వాడ్‌ రహదారిలో ఇట్టిగట్టి క్రాసింగ్‌ వద్ద మినీ బస్సు, ట్రక్కు ఎదురురుగా వచ్చి ఢీకొనగా శుక్రవారం జరిగిన ప్రమాదం లో 13 మంది అక్కడికక్కడే మృతి చెందారు.మరికొందరు తీవ్రగాయలతో బయట పడ్డారు.వీరిలో ఎక్కువ మంది

మహిళలే ఉన్నారు. ఈ ఘటనలో గాయపడిన వారిని కిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. వీరిలో కొందరి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. దేవనగరికి చెందిన వీరంతా గోవాలో ఓ వేడుకలో పాల్గొనేందుకు వెళ్తుండగా ఈ విషాదం చోటుచేసుకుంది. ఘటనా స్థలంలో సహాయక చర్యలను ఎస్పీ కృష్ణకాంత్‌ పర్యవేక్షిస్తున్నారు.