- Neti Charithra
Breaking.. మైనర్ బాలికపై అత్యాచారం కేసులో సంచలన తీర్పు ఇచ్చిన న్యాయస్థానం..!
Breaking.. మైనర్ బాలికపై అత్యాచారం కేసులో సంచలన తీర్పు ఇచ్చిన న్యాయస్థానం..!
నేటి చరిత్ర: (ప్రత్యేక ప్రతినిథి)
మైనర్ బాలిక పై జరిగిన లైంగిక దాడి కేసులో న్యాయస్థానం సంచలన తీర్పును ఇచ్చింది. ప్రకాశం జిల్లాలో జరిగిన ఘటన కు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డ నేరం రుజువు కావడంతో నిందితునికి ఏడేళ్ల జైలుశిక్షతోపాటు రూ.3వేల జరిమానా విధిస్తూ ఎస్సీ, ఎస్టీ(అత్యాచార నిరోధక) ప్రత్యేక న్యాయస్థానం కమ్ ఏడో అదనపు జిల్లా న్యాయస్థానం న్యాయమూర్తి
ఒ.వెంకట నాగేశ్వరరావు తీర్పునిచ్చారు. జరిమానా చెల్లించని పక్షంలో నిందితుడు మరో నెల జైలుశిక్ష అదనంగా అనుభవించాలని ఆదేశించారు.
సింహాచలం ప్రాంతానికి చెందిన గులివిందల నాగరాజు, అదే ప్రాంతానికి చెందిన బాలికను ప్రేమపేరుతో పరిచయం పెంచుకున్నాడు. ఆమె తల్లిదండ్రులు లేని సమయంలో ఇంటికెళ్లేవాడు. శారీరకంగా లొంగదీసుకోవడంతో బాలిక గర్భం దాల్చింది. బాధితురాలు విషయం తల్లిదండ్రులకు తెలియజేసింది. వారు గోపాలపట్నం పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితునిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు విచారణలో ఉండగా బాలిక మగబిడ్డకు జన్మనిచ్చింది. కేసు విచారణలో కూడా బాధితురాలి గర్భంతో తనకు సంబంధం లేదని నాగరాజు వాదనలు వినిపించాడు. ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎస్.ఎస్.వాసు నిందితునికి డి.ఎన్.ఎ.పరీక్ష నిర్వహించాలని న్యాయ స్థానాన్ని కోరారు. డీఎన్ఏ పరీక్షలో బాలిక గర్భం దాల్చడానికి నిందితుడే బాధ్యుడని ఫోరెన్సిక్ నిపుణులు నివేదిక సమర్పించారు. దీంతోపాటు ఇతర సాక్ష్యాలను పరిశీలించిన న్యాయమూర్తి నిందితునికి పైవిధంగా శిక్ష విధించారు