• Neti Charithra

Breaking.. ముందే..సహజీవనం..ఆపై..అనుమానం.. తంబల్లపల్లె లో జంట హత్యల కల కలం..!


Breaking.. ముందే..సహజీవనం..ఆపై..అనుమానం.. తంబల్లపల్లె లో జంట హత్యల కల కలం..!తంబల్లపల్లె: నేటి చరిత్ర


ముందే .. సహజీవనం.. ఆపై

అనుమానం పడగలు విప్పింది.. ఒక హత్య ను.. కప్పి పుచ్చేందుకు మరో హత్య చేసి చివరికి నిందితుడు కట కటాల పాలైన ఘటన చిత్తూరు జిల్లా తంబల్లపల్లె లో కల కలం రేపింది. మదనపల్లె డిఎస్పీ రవిమనోహర చారి కథనం మేరకు.. తంబల్లపల్లె మండలం

గంగిరెడ్డి పల్లి పంచాయతీ గోవిందు వారిపల్లె లో నివాసం ఉంటున్న వివాహిత సరళ కు ముగ్గురు పిల్లలు ఈమె తో గంగిరెడ్డి పల్లికి చెందిన చేపల వ్యాపారి మౌలాలి సహజీవనం

చేస్తున్నాడు.ఈమె ఇతరులు తో సన్నిహితంగా ఉంటోందని అనుమానం పెంచుకున్న మౌలాలి సరళ ను హత్యచేసి మృత దేహానికి రాతి బండ కట్టి పెద్దెరు ప్రాజెక్ట్ లో తోసేశాడు. ఈ విషయంలో మౌలాలి ని నిలదీసిన సరళ తల్లి పోలీసులకు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించటం తో గంగులమ్మ(65) ను కూడా అతను హత్య చేసి గంగచేరువు లో చీరతో చుట్టి మృత దేహాన్ని పారవేశాడు. ఈ ఘటన నాలుగు మాసాల క్రితం జరిగింది. సరళ కు చెందిన ముగ్గురు పిల్లలు ను కూడా కర్ణాటక సరిహద్దులో మౌలాలి నిర్బంధించాడు. దింతో బంధువులకు అనుమానం వచ్చి జనవరి 24

న తంబల్లపల్లె పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసును డిఎస్పీ రవిమనోహర చారి ఆదేశాల మేరకు ములకలచేరువు సీఐ సురేష్, తంబల్లపల్లె ఎస్ ఐ సహదేవిలు అనుమానితుడు మౌలను అదుపు లోకి తీసుకొని లోతైన విచారణ చేయగా అసలు కథ వెలుగు చూసింది. దింతో నిందితుడు మౌలాలి ని అరెస్ట్ చేసి పోలీసులు రిమాండ్ కు పంపారు.