• Neti Charithra

Breaking.. మంత్ర.. శక్తి కోసమే.. మదనపల్లె లో జంట హత్యలు..!



Breaking.. మంత్ర.. శక్తి కోసమే.. మదనపల్లె లో జంట హత్యలు..!




మదనపల్లె: నేటి చరిత్ర


చిత్తూరు జిల్లా మదనపల్లె లో సంచలనం కలిగించిన జంట హత్యల కేసు లో ఒళ్లు గగుర్పాటు కల్గించే విషయాలు వెలుగు చూస్తున్నాయి. సమాజంలో ఆదర్శ ప్రాయంగా ఉంటున్న మదనపల్లె మహిళా కళాశాల వైస్ ప్రిన్సిపాల్ రాజగోపాల్ నాయుడు ఆయన సతీమణి మాస్టర్ మైండ్ స్కూల్

కరస్పాండెంట్ పద్మజ లు తీరు తో సభ్య సమాజం ఒక్కసారిగా షాక్ కు గురైంది.

మంత్ర శక్తుల కోసమే కన్న బిడ్డలు బాలి చేసినట్లు తెలుస్తోంది.మంత్ర శక్తులు.. క్షుద్ర పూజలు పట్ల కొన్నేళ్లుగా ఆసక్తిగా ఉంటున్న .. ఈ దంపతులు ఇటీవల లాక్ డౌన్ తో వీటిపై మరింత లోతుగా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. వీరి బలహీనతలు ను కొందరు అజ్ఞాత స్వామీజీ లుక్యాష్ చేసుకుని వీరిని ఓ మాయా ప్రపంచం లోకి నెట్టి నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా తమిళనాడు లో ని ఓ స్వామీజీ వీరిని ప్రేరేపించినట్లు సమాచారం. క్షుద్రపూజలు లో పట్టు సాధిస్తే.. మంత్ర శక్తి సాధించి సమాజం లో ఏదైనా సాధించవచ్చని వారిని ప్రేరేపించినట్లు తెలుస్తోంది. ఈ ప్రయోగాలకు ఒకరిద్దరి సన్నిహితులకు ప్రేరేపించగా వారు ముందుకు రాకపోవడంతో

మొదట వీరి క్షుద్ర పూజలు పై సొంత పిల్లలలో ఆసక్తి పెంచటం తో పాటు

మొదటి సారితిరుపతి విద్యానికేత న్ ఇంజనీరింగ్ కళాశాలలో మెరిట్ ర్యాంక్ సాధించిన పెద్దమ్మాయి అలైఖ్య శరీరం పై బొబ్బలు రాగ క్షుపూజలు చేయటం తో బొబ్బలు ను నయం చేసి పిల్లల్లో కూడా క్షుద్రపూజలు పై తల్లి తండ్రులు నమ్మకం కల్గించి నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో నే గత ఏడాది మార్చి చివరన లాక్ డౌన్

రావటంతో భోపాల్ లోని అటవీశాఖ లో మేనేజర్ గా విధులు చూస్తున్న ఆలేఖ్య, తమిళనాడు లో ఏ ఆర్ రహిమాన్ మ్యూజిక్ సెంటర్ లో శిక్షణ పొందుతున్న మరో కుమార్తె దివ్య సాయి కూడా మదనపల్లె కు చేరుకున్న నేపథ్యం లో క్షుద్ర పూజలు పట్ల కుటుంబం మొత్తం నిత్యం.. మంత్రాలు.. క్షుద్రపూజలు పట్ల పూర్తి గా దృష్టి మళ్ళి నట్లు తెలుస్తోంది.

తాజాగా చేసిన పూజలు సందర్భంగా తమ బిడ్డ అలైఖ్య కు దయ్యం పట్టిందని దయ్యాన్ని దూరం చేసే నెపం తోనగ్నంగా పూజలు కు ప్రయత్నించి నట్లు తెలు స్తోంది. ఈ ప్రయత్నం లోనే అలైఖ్య పైఇనుప డంప్ తో తలపై బాది నట్లు సమాచారం.ఆమె కోసం ..మరో ప్రయత్నం చేసేందుకుమరో కుమార్తె దివ్యసాయి ను శూలం తో పొడిచి క్షుద్ర పూజలు చేయడం తో చేతికి వచ్చిన ఇద్దరు కుమార్తెలు ను వారు పోగొట్టుకున్నారు.

వాస్తవానికి క్షుద్ర పూజలతో

మంత్రం శక్తి పొందాలనే ఆశ తో పాటు ఎలాంటి జబ్బు లు అయినా నయం చేయాలని మూఢ నమ్మకం ఆ కుటుంబం లో విషాదాన్ని నింపింది.

1,787 views0 comments
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon