- Neti Charithra
Breaking... మూడు వాహనాలు ఢీ..నలుగురు సజీవ దహనం..!
Breaking... మూడు వాహనాలు ఢీ..నలుగురు సజీవ దహనం..!
నేటి చరిత్ర: కడప
కడప ఎయిర్పోర్ట్ సమీపంలో ఆదివారం అర్ధరాత్రిఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కడప-తాడిపత్రి మధ్య గోటూరు, తోళ్లగంగన్నపల్లె మధ్యలో టిప్పర్ సుమో, కారు ఢీకొనగా.. ఇందులో నలుగురు సజీవ దహనం అయ్యారు. ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఎర్రచందనం దుంగల్ని తరలిస్తున్న సుమోను టిప్పర్ ఢీకొట్టగా.. వెంటనే మరో కారు టిప్పర్ని ఢీకొట్టింది. సజీవ దహనమైన నలుగురు తమిళనాడుకు చెందిన ఎర్రచందనం
స్మగర్లుగా గుర్తించారు. వెంటనే రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమాదానికి కారణమైన మరో కారు కూడా స్మగ్లర్లదే అని గుర్తించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు.
216 views0 comments