• Neti Charithra

Breaking.. మూడు రోజుల్లో పెళ్లి చేసుకోవాల్సిన కానిస్టేబుల్ మద్యం కేసులో అరెస్ట్..!


Breaking.. మూడు రోజుల్లో పెళ్లి చేసుకోవాల్సిన కానిస్టేబుల్ మద్యం కేసులో అరెస్ట్..!


కర్నూలు: నేటి చరిత్ర


డిసెంబర్ 5 న పెళ్లి చేసుకోవాల్సిన కానిస్టేబుల్ మద్యం కేసులో అరెస్ట్ అయిన ఘటన కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది.

వివరాలు ఇలా ఉన్నాయి.డోన్‌కు చెందిన లక్ష్మీనారాయణ యాదవ్‌ 2018లో కానిస్టేబుల్‌గా చేరాడు. స్పెషల్‌ పార్టీలో విధులు నిర్వర్తిస్తున్నాడు. సబ్‌ఇన్‌స్పెక్టర్‌ ఉద్యోగం కోసం సన్నద్ధమవుతున్న తన మిత్రుడు ఉల్చాలకు చెందిన బుర్ర

లక్ష్మన్నతో కలిసి కర్నూలులోనే అద్దె గదిలో ఉంటున్నాడు. వివాహం నిశ్చయమైన ఇతనికి ఈనెల 5న పెళ్లికి ఏర్పాట్లు చేశారు. బుధవారం కర్నూలు పరిధిలోని పంచలింగాల వద్ద సరిహద్దు చెక్‌పోస్టులో ఉన్న తన సహ సిబ్బందికి శుభలేఖలు పంచాడు. పెళ్లి విందు ఇవ్వాలన్న ఉద్దేశంతో తక్కువ ధరకు లభించే మద్యం కోసం తన మిత్రుడు లక్ష్మన్నను వెంట బెట్టుకొని తెలంగాణలోని అలంపూర్‌కు వెళ్లాడు.

మద్యం కొనుగోలు చేసి తిరిగి కర్నూలుకు బయలుదేరాడు. పంచలింగాల సమీపంలోని హైవేలో నిఘా ఉంచిన స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో కర్నూలు స్టేషన్‌ ఎస్సై స్వామినాథ్‌ సిబ్బందితో కలిసి వీరిని ఆపి తనిఖీ చేయగా 11 మద్యం సీసాలు దొరికాయి. వాహనం, మద్యం సీజ్‌ చేసి ఇద్దరినీ అరెస్టు చేశారు.





554 views0 comments
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon